వివరాల్లోకి వెళితే... అంకుశాపూర్‌లోని ఎస్‌పీఆర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆనంద్ గౌడ్ అనే విద్యార్ధి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ మంగళవారం అర్ధరాత్రి హాస్టల్ క్యాంపస్‌లోని కిటికీకి తాడు బిగించుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే ఈ సంఘటనను గమనించిన తోటి విద్యార్ధులు స్కూల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో హాస్టల్ యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చారు.
తద్వారా రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆనంద్ గౌడ్ మృతదేహాన్ని కిందకు దించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలో ఉన్న ఆనంద్ తల్లిదండ్రులకు పోలీసులు విషయాన్ని తెలియజేశారు. దీంతో సంఘటనా స్థలానికి ఆనంద్ గౌడ్ పెదనాన్న చేరుకున్నారు. హాస్టల్ రెండో అంతస్తులో కిటికీకి ఆనంద్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు అన్నికోణాల్లో విచారణ జరుపుతున్నారు.