ఆంబులెన్సులో కరోనా బాధితురాలు డెలివరీ

బుధవారం, 29 జులై 2020 (16:36 IST)
కరోనా బారిన పడిన నిండు గర్భిణిని వైద్యం నిమిత్తం 108 వాహనంలో హైదరాబాదు ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మార్గమధ్యమంలోనే పురుడు పోసుకున్నది. ఈ ఘటన గురించి 108 సిబ్బంది తెలిపిన వివరాల మేరకు, కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన ఓ మహిళ 9 నెలల నిండు గర్భిణి. కాగా ఆమెకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్‍గా నిర్ధారణయ్యింది.
 
దీంతో వైద్యులు ఆ మహిళను డెలివరి కోసం ప్రత్యేక జాగ్రత్త నిమిత్తం హైదరాబాదు తరలించేందుకు నుంగనూరుకు చెందిన 108 సిబ్బందికి ప్రయత్నించారు. ఆంబులెన్స్‌లో తరలిస్తున్న సందర్భంలో మహిళకు మార్గమద్యమంలో పురిటి నొప్పి మొదలయ్యింది. సరిగ్గా మేడ్చల్ శామీర్ పేట వద్దకు చేరుకోగా ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.
 
దీంతో 108 సిబ్బంది ఆంబులెన్స్ లోనే ఆమెకు డెలివరి చేయగా ఆమె పండంటి పాపకు జన్మనిచ్చింది. ఆ తర్వాత శిశువు, తల్లిని అదే వాహనంలో హైదరాబాదుకు తరలించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు