భార్య రాజస్థాన్‌లో... భర్త మరో మహిళతో హైదరాబాదులో...

సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (19:09 IST)
హైదరాబాద్ లోని రామాంత్ పూర్‌లో ఉన్న న్యాయవాది క్రిష్ణమాచారి రాసలీలల బాగోతాన్ని అతని భార్య బట్టబయలు చేసింది. రామాంతపూర్ లోని ఒక అపార్టుమెంట్లో మరో మహిళతో క్రిష్ణమాచారి ఉండగా భార్య పట్టించింది. 2008 సంవత్సరంలో వింధ్యారాణి, క్రిష్ణమాచారికి వివాహం జరిగింది. ఉద్యోగరీత్యా రాజస్థాన్‌లో వింధ్యారాణి ఉండడంతో క్రిష్ణమాచారి హైదరాబాద్ లోని తన ఇంటికి సమీపంలో ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
 
బంధువులతో సహా వచ్చిన వింధ్యారాణి తన భర్త రాసలీలలను బయటపెట్టింది. దీంతో వింధ్యారాణి బంధువులు క్రిష్ణమాచారిని నిలదీశారు. అయితే క్రిష్ణమాచారి వారితో వాగ్వాదానికి దిగాడు. పోలీసులకు ఫిర్యాదు చేసుకోమంటూ తనకేం భయం లేదన్నాడు క్రిష్ణమాచారి. దీంతో వింధ్యారాణి బంధువులు క్రిష్ణమాచారి అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను కారులో ఎక్కించుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు