కాగా ఈ రోజు ప్రెగ్నెన్సీతో ఉన్న భార్య అమృతను స్థానిక జ్యోతి హాస్పటల్‌లో చూపించి తిరిగి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి తల్వార్‌తో దాడి చెయ్యడంతో ప్రణయ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రేమ వివాహమే యువకుడి హత్యకు కారణమని భావించిన మృతుడి కుటుంబీకులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా ఉంది. జిల్లా ఎస్పీ రంగనాథ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షిస్తున్నారు.
తండ్రి పెరుమళ్ల బాలస్వామి ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తున్నారు. మరోవైపు మిర్యాలగూడలో ప్రణయ్ హత్యపై జిల్లా ఎస్పీ రంగనాధ్ విచారణను వేగవంతం చేశారు. హతుడు ప్రణయ్‌ది పరువు హత్యగానే అనుమానిస్తున్నట్లు చెప్పారు. గతంలో అతడికి ప్రాణ హాని ఉందని అతడి తలిదండ్రులు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. ఈ క్రమంలో యువతి తండ్రి మారుతిరావును కూడా హెచ్చరించినట్లు పేర్కొన్నారు.
ప్రణయ్‌కు ఎలాంటి హాని చేయమని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మొన్నటిదాకా కూతురు, అల్లుడితో సఖ్యతగా ఉంటే వివాదం సద్దుమణిగిందనుకున్నామని చెప్పారు. కాగా ఈ హత్యకు అమ్మాయి తండ్రే సూత్రధారి అని ఇంకా నిర్థారణ కాలేదనీ, ప్రణయ్ హత్యపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టి వాస్తవాలను వెలికి తీస్తామని అన్నారు.