హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓ వ్యక్తి తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బెంజ్ కారులో ఉన్న సదరు వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నార్సింగి వద్ద ఉన్న ఔటర్ రింగు రోడ్డు మీద ఈ ఘటన జరిగింది. TS 09 UB 6040 నెంబరు గల రెడ్ కలర్ బెంజ్ కారులో వచ్చిన వ్యక్తి రోడ్డుమీద కారు ఆపి తుపాకీతో కాల్చుకున్నాడన్నది ప్రాధమిక సమాచారం.