అదే రోజు తూప్రాన్ మీదుగా స్వగ్రామానికి బయలుదేరి, తూప్రాన్ పురపాలిక పరిధి అల్లాపూర్ వద్ద మద్యం తాగేందుకు ఆగాడు. మద్యం, ఆహారం తెచ్చుకొని తూప్రాన్-గజ్వేల్ రహదారి పక్కన కొద్ది దూరంలో కూర్చుని.. తినడానికి చేతిని ఆహారంలో పెట్టి గుండెపోటుతో అలానే చనిపోయాడు.
వ్యవసాయం చేసుకునే సాయిలుకు పిల్లలు లేరు. ఈ ఘటనపై తూప్రాన్ సామాజిక ఆరోగ్య కేంద్రం పర్యవేక్షకుడు అమర్‌సింగ్‌ను అడగగా.. సైలెంట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ వల్ల గుండెపోటు వచ్చి ఉంటుందని.. దీంతో నొప్పి, ఆనవాళ్లు తెలియకుండా ప్రాణాలు పోతాయని వివరించారు.