కరోనా భయం: మూడో అంతస్తు నుంచి దూకేసిన రోగి, మృతి

మంగళవారం, 25 మే 2021 (20:00 IST)
కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రి మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకిన కరోనా రోగి అక్కడికక్కడే మృతి చెందాడు. కోవిడ్ ఇక తనకు తగ్గదని ఆందోళన చెందిన రోగి పైఅంతస్తు నుంచి దూకినట్లు చెపుతున్నారు.
 
మృతుడు తేలప్రోలు శివారు కొత్తూరు గ్రామనికి చెందిన పోలిబోయిన రోశయ్య(50)గుర్తించారు.
రోశయ్య మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఆత్కూరు ఎస్సై శ్రీనివాస్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు