నా భర్త కొద్దిసేపట్లో హైదరాబాద్ బస్సు దిగుతాడు, వెళ్లి చంపేయ్: ప్రియుడితో వివాహిత

శనివారం, 6 ఫిబ్రవరి 2021 (16:03 IST)
తన అక్రమ సంబంధానికి అడ్డుగా వున్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడి చేత హత్య చేయించింది ఓ వివాహిత. ప్రియుడితో సాగిస్తున్న బంధం భర్తకు తెలియడంతో ఇక అతడు వుండగా కలుసుకోలేమనీ, అతడి అడ్డు తొలగిస్తే హాయిగా వుండొచ్చని ప్రియుడిని పురమాయించడంతో అతడు ఆమె చెప్పినట్లే చేసాడు. కానీ అంతా పోలీసులకు దొరికిపోయి ఊచలు లెక్కిస్తున్నారు.
 
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా వడ్డేపల్లికి చెందిన అనిల్ కన్పించడం లేదంటూ అతడి భార్య పూజిత గత నెల 24వ తేదీని పోలీసుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేస్కున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో 29వ తేదీన రాయపర్తి మండలం పరిధిలోని మైలారం రిజర్వాయర్లో శవం తేలియాడుతోందన్న సమాచారంతో పోలీసులు అక్కడికెళ్లారు. విచారించి చూడగా అది పూజిత భర్తదని తేలింది. మరోవైపు తమ కుమారుడు మరణానికి పూజితే కారణమని మృతుడి బంధువులు ఆరోపంచారు. దీనితో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనితో అసలు విషయం బయటపడింది.
 
2018లో పూజిత భర్త సమీప బంధువు డానీ వద్ద ట్రాలీ ఆటో తనఖా పెట్టి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ అప్పును నెలవారీ వాయిదాల్లో చెల్లిస్తున్నాడు. ఈ వాయిదాలను తీసుకునేందుకు ఇంటికి వస్తూ అనిల్ భార్య పూజితపై కన్నేసాడు డానీ. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం కాస్తా భర్త దృష్టికి వచ్చింది.
 
 భార్యను మందలించాడు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. సరేనని చెప్పిన భార్య పూజత, తన భర్త వుండగా ఇక ప్రియుడ్ని కలుసుకోవడం కష్టమని భావించి హైదరాబాద్ నుంచి బస్సులో వస్తున్న భర్త ఆచూకి ప్రియుడికి చెప్పింది. ఎలాగైనా చంపేయాలని చెప్పింది. ఆమె అలా కోరడంతో డానీ మరో ఇద్దరితో కలిసి అనిల్ హైదరాబాద్ బస్సు దిగగానే అతడిని కారులో ఎక్కించుకుని శివారు ప్రాంతానికి వెళ్లారు. అక్కడ అతడికి పూటుగా మద్యం పోసి మత్తులోకి జారుకోగానే అతడి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేసారు. ఆ తర్వాత శవాన్ని రిజర్వాయర్లో పడేసి వెళ్లిపోయారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు