తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి

బుధవారం, 11 జనవరి 2023 (18:49 IST)
Tealangana CS
తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారి నియామితులయ్యారు. సీనియర్ ఐఏఎస్ అధికారిణి అయిన ఆమె పేరును తెలంగాణ సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో ఆమెను సీఎస్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఆమె ఏప్రిల్ 2025 వరకు కొనసాగనున్నారు. 
 
మరోవైపు తనకు సీఎస్ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ ను ఆమె కలిశారు. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా శాంతికుమారిని సీఎం కేసీఆర్ అభినందించారు. 
 
1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారిణి అయిన శాంతికుమారి.. తెలంగాణకు తొలి సీఎస్ గా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ప్రస్తుతం ఆమె అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె మెదక్ జిల్లా కలెక్టరుగా బాధ్యతలు నిర్వర్తించారు 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు