నన్ను సీఎం చేస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తానో చూడండి: అక్బరుద్ధీన్

ఆదివారం, 25 నవంబరు 2018 (16:52 IST)
తనను సీఎం చేస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తానో చూడంటి అంటూ ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో ఆదివారం అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం ఎమ్మెల్యే పనికాదన్నారు. ఉపాధి కల్పించడం, సీఎం, పీఎం పని అంటూ అన్నారు. అలాగే సీఎం, పీఎం పదవులు లేకపోయినా తాము ఉద్యోగాలు ఇప్పించామంటూ అక్బర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
మరోవైపు ఎంఐఎంకు తెలంగాణ సీఎం కేసీఆర్ జడుసుకుంటున్నారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. హిందూ దేవతలను ఎంఐఎం నేత అక్బరుద్దీన్ అవమానించినా.. కేసీఆర్ సర్కార్ ఏమీ చేయలేకపోయిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో ఎంఐఎంను ఎదుర్కునే సత్తా బీజేపీకే వుందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ సర్కారుతో అభివృద్ధి జరగలేదని అమిత్ షా ఫైర్ అయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు