హైదరాబాద్ మార్కెట్లు, బజార్ల నుండి తెలుగు రాష్ట్రాలకే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా నిత్యావసర సరుకులు ఎగుమతి అవుతుంటాయి. దీంతో బేగం బజార్‌లో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇక్కడ సుమారు 700 వరకు హోల్‌సేల్ కిరాణా దుకాణాలున్నాయి.
బేగంబజార్‌లోని పన్నెండు మంది వ్యాపారులకు కరోనా రావడం, ఇందులో ముగ్గురు మృతి చెందడంతో వ్యాపారులు హడలిపోతున్నారు. దీంతో ఈ నెల 28 నుంచి బేగంజబార్ మార్కెట్ పరిధిలోకి వచ్చే కిషన్‌గంజ్, మహారాజ్‌గంజ్, బర్తన్ బజార్ తదితర మార్కెట్లను మూసివేస్తున్నారు.
మరో వైపు లాడ్ బజార్‌ను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్టు లాడ్ బజార్ ట్రేడ్ యూనియన్ వ్యాపారులు ప్రకటించారు. జూలై ఐదు వరకు సికింద్రాబాద్ జనరల్ బజార్, సూర్యా టవర్స్, ప్యారడైజ్ మూసివేయనున్నట్లు తెలిపారు.