తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలకు అడిషనల్ కలెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం... జగిత్యాల అదనపు కలెక్టర్‌గా జీఎస్ లత, నారాయణ్ పేట్ అదనపు కలెక్టర్‌గా జి. పద్మజారాణి, రాజన్న సిరిసిల్లా అదనపు కలెక్టర్‌గా ఖీమా నాయక్ కు పోస్టింగులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.
ఇప్పటికే రాష్ట్రంలో వరుసగా ఐపీఎస్, ఐఏఎస్, అదనపు కలెక్టర్ హోదా, నాన్ కేడర్ అధికారులను బదిలీ చేయడం, వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగులను ఇస్తోంది.
ఈ నేపథ్యంలో వరంగల్ అదనపు కలెక్టర్ గా కె. శ్రీవాస్తవ, ములుగు అదనపు కలెక్టర్ గా వై.వి. గణేష్, మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్‌గా ఎం. డేవిడ్ లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.