ఉదయం, రాత్రి వేళ్లల్లో తేడా ఉండడంతో ఈ గ్రామానికి మూడు జాముల కుదురుపాకగా పేరు వచ్చింది. సాయంత్రం కాగానే సూర్యుడు రంగనాయకుల గుట్ట వెనుక దాక్కుంటాడని గ్రామస్థులు చెబుతున్నారు. పనులకు వెళ్లిన వారు చీకటిపడుతుందని త్వరగానే ఇంటికి చేరుకుంటారు. ఊరికి నాలుగువైపులా ఉన్న గుట్టలు కొంత ప్రయోజనం చేకూర్చినా వేసవి కాలంలో ఇబ్బంది ఉంటుందని గ్రామస్థులు చెబుతున్నారు.