హైదరాబాద్‌లో పరువు హత్య.. యువకుడిని నలుగురు కత్తులతో..
శనివారం, 21 మే 2022 (08:42 IST)
హైదరాబాద్‌లోని సరూర్ నగర్‌లో చోటుచేసుకున్న పరువు హత్య ఘటనను మరిచిపోక ముందే మరో పరువు హత్య నగరంలో చోటుచేసుకుంది.
ఓ యువకుడు తమ ఇంటి ఆడపిల్లను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కోపంతో యువతి కుటుంబీకులు నడిరోడ్డుపై విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేసి హతమార్చారు.
వివరాల్లోకి వెళితే.. బేగంబజార్ మచ్చి మార్కెట్ వద్ద నీరజ్ పన్వార్ అనే యువకుడిని నలుగురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు.
ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని.. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.