మరో మూడు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్తగా వుండాలి

శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (18:19 IST)
మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాదు నగరంలో రానున్న మూడురోజుల్లో భారీ వర్షం కురుస్తుందని వెల్లడించారు.
 
మరోవైపు పులివెందుల మరియు కదిరి నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతమైన తలుపుల మండలం గొల్ల పల్లి తండా పైభాగంలోని చిన్న పల్లి-ఉడుముల కుర్తి గ్రామాల పరిసర  ప్రాంతాలలో భారీ వర్షాలు గురువారం రాత్రి కురిశాయి. ఈ వర్షాలకు గొల్లపల్లి వద్ద ఉన్న బ్రిడ్జి తెగిపోయింది.
 

Take care Hyderabadis.
Video from Krishna Nagar, Yousufguda ( WA) #HyderabadRains pic.twitter.com/C1FN21Car7

— Journalist Kavitha (@iamKavithaRao) September 2, 2021
రాకపోకలు నిలిచిపోయాయి పులివెందుల సమీపంలోని కనంపల్లి చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమై గొల్లపల్లి తండా వరకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. రాత్రి నుంచి వాహనాల రాకపోకలను నిలిపి వేయించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి ప్రమాదాన్ని నివారించారు.
 
భారీ వర్షాలకు నామాలగుండు వంక  నీటి ప్రవాహంతోఉద్ధృతంగా ప్రవహించింది. కనంపల్లి సమీపంలోని అరటి ,మామిడి ఇతర రకాలైన పంట పొలాలు నీట మునిగాయి. భూములు కోతకు గురయ్యాయి. పులివెందుల కదిరి పట్టణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున ట్రాఫిక్ రెండువైపులా ఉండిపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు