తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు- కేసీఆర్ తీపి కబురు
మంగళవారం, 15 ఆగస్టు 2023 (09:09 IST)
తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. విజయవాడలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మరోవైపు గోల్కొండ కోటలో తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్ర్య దినోత్సవ వేడులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జాతీయ జెండా ఎగరేసిన అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
మరోవైపు సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారికి తీపికబురు అందించారు. పంట రుణమాఫీలో భాగంగా రూ. 99,999 లోపు ఉన్న మొత్తం రుణాలను మాఫ్ చేసి 9,02,843 మంది రైతులను రుణ విముక్తులను చేశారు.
రుణ మాఫీకి అవసరమైన మొత్తం నగదును రైతుల తరఫున బ్యాంకులకు జమ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు.