తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను బీజేపీ అధికార ప్రతినిధి ఖేమ్ చంద్ శర్మ యూ ఇడియట్ అంటూ తిట్టారు. దీనికి కేటీఆర్ మాత్రం ఘాటుగా స్పందించలేదు. సార్.. అంటూ మర్యాదగా సంబోధిస్తూ గట్టిగానే కౌంటరిచ్చారు. అసలు వీరిద్దరి మధ్య ఎందుకు వివాదం జరిగిందో ఓసారి పరిశీలిద్ధాం.
భారత్ వ్యాక్సిన్ హబ్‌గా ఉన్నప్పుడు ఇక్కడ డిమాండ్ - సరఫరా మధ్య అంతరం ఎందుకు ఉంది..? దీనిపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మిగతా దేశాలు 2020 ప్రథమార్థంలోనే టీకాలకు ఆర్డర్లు ఇచ్చినపుడు, భారత ప్రభుత్వం ఎందుకు ఆలస్యంగా మేల్కొంది..? అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఆయన ట్వీట్‌కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సార్.. నేనూ మీలా మాట్లాడగలను. కానీ అది మా సంస్కృతిలో లేదు. ఇజ్రాయిల్ జనాభాలో 60 శాతం మందికి, అమెరికా 40 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చాయి. దీనిని బట్టి మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవచ్చు. వాస్తవాలను జీర్ణించుకోలేని మీలాంటి వారికి ఇలాంటి విషయాలు కఠినంగానే ఉంటాయి అని కేటీఆర్ బదులిచ్చారు.