వైద్య ఖర్చులు చూసి కరోనా రోగులు భయపడి పోతున్నారు..

ఆదివారం, 23 మే 2021 (16:23 IST)
వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బిజెపి నేతలు నిరసన నిర్వహించారు. నెల్లూరు నగరంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో జరిగిన నిరసన బిజెపి జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులలో వెంటిలేటర్ల కొరత వలన కరోనా రోగులు ప్రైవేటు మరియు కార్పొరేటు ఆసుపత్రులలో చేరుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వైద్య  ఖర్చులు భరించే స్థితిలో సామాన్యులు లేరని పేర్కొన్నారు.
 
కరోనా విపత్కర పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని మరణాల శాతాన్ని తగ్గించేందుకు ఉన్నత వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల ఫిబ్రవరిలో కేంద్రం చేసిన పలు సూచనల ను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినందు వల్లనే ఆక్సిజన్ కొరత ఐసియు బెడ్లు కొరత వెంటిలేటర్ల కొరత ఏర్పడి మరణాల శాతం పెరిగిందని నిరసనలో తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు