తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువుల కిడ్నాప్ కేసులో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హఫీజ్‌పేట్‌లోని భూ వ్యవహారమే ఈ కిడ్నాప్‌కు ప్రధాన కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఏపీ మాజీమంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. విచారణ కోసం ఆమెను బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్టు సమాచారం.
మరోవైపు ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి బాధితులు ప్రవీణ్ రావుతో పాటు అతడి సోదరులు నవీన్ రావు, సునీల్ రావు వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. మంగళవారం అర్థరాత్రి సీఎం కేసీఆర్ బంధువులైన ప్రవీణ్‌రావు, సునీల్‌రావు, నవీన్‌రావులను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు.