కుటుంబ కలహాలు.. రెండేళ్ల బాలుడి మృతి

మంగళవారం, 22 నవంబరు 2022 (10:59 IST)
కుటుంబ కలహాల కారణంగా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అత్తింటి వారి వేధింపుల కారణంగా ఆ బాలుడు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. రామంతాపూర్‌ గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన సనాబేగానికి భర్త, రెండు నెలల కుమారుడు ఉన్నాడు.  
 
ఈ నెల 19న అర్ధరాత్రి దాటిన తర్వాత తన కుమారుడు కనిపించక పోవడంతో ఆందోళనకు గురైన సనాబేగం చిన్నారి కోసం ఇంటి పరిసరాల్లో గాలించింది. కుమారుడు ఏమయ్యాడో అంటూ తల్లడిల్లింది. 
 
అనుమానంతో నీటి సంపులో వెతకగా అందులో కనిపించాడు. దీంతో బాలుడిని వెలికి తీసి చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేట్‌ అసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు.
 
చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తల్లి సనాబేగం కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు