బాలికలను కారులో పాఠశాలకు తీసుకెళుతూ డ్రైవర్ కామదాడి...

శుక్రవారం, 9 నవంబరు 2018 (14:59 IST)
బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌‌కు తరలించారు. నారాయణగూడ గాంధీకుటీర్‌లో నివాసముండే 24 ఏళ్ల ఉదయ్‌ కుమార్ మెట్రో రైల్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. స్థానికంగా ఉండే ఓ చిన్నారికి గురువారం చాక్లెట్ ఇస్తానంటూ ఆశ చూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. 
 
ఆ చిన్నారి ఏడ్వటంతో చాక్లెట్ చేతికిచ్చి, ఎవరికీ చెప్పొద్దంటూ ఇంటికి పంపించాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు నారాయణగూడ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్సై దయాకర్‌ రెడ్డి అజయ్‌ కుమార్‌‌ను అరెస్టు చేసి, అతనిపై పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు. 
 
మరోవైపు ఇద్దరు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో ఓ కారు డ్రైవరును బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ లోని సాగర్ సొసైటీలో నివశించే ఉద్యోగి వద్ద వరంగల్ జిల్లా కురవి మండలం మోదుగులగూడెం గ్రామానికి చెందిన కె. నాగరాజు కొద్ది నెలల క్రితం కారు డ్రైవరుగా చేరాడు. నమ్మకంగా పనిచేస్తుండటంతో సదరు ఉద్యోగి ఇద్దరి కుమార్తెలను విద్యాసంస్థలకు తీసుకెళ్లి, తీసుకొచ్చే పనిని అప్పగించారు. 
 
ఈ క్రమంలో కొద్ది రోజుల కిందట ఆ బాలలతో నాగరాజు అసభ్యంగా ప్రవర్తించి వారిద్దరిని లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఇంట్లోవారికి చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అయితే వారిద్దరూ బెదరకుండా ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో తండ్రి బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నాగరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు