దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రంలో మనుషుల సంగతి ఏమోగానీ, పశువుల సంరక్షణకు మాత్రం ఆ సర్కారు మంచి నిర్ణయాలే తీసుకుంటోంది. తాజాగా గేదెలకు బీమా సౌకర్యం కల్పించింది. అతి తక్కువ ప్రీమియంతో బీమా సదుపాయాన్ని రైతు ముందుకు తీసుకువచ్చింది. కేవలం రూ.630 ప్రీమియం చెల్లిస్తే చాలు మూడేళ్ల వరకు బర్రెకు, ఆవుకు బీమా సదుపాయం కల్పించింది.
పశువు మృతిచెందితే గ్రామానికి చెందిన పశు వైద్యాధికారికి సమాచారం అందిస్తే పంచనామా నిర్వహించి బీమా కంపెనీకి సిఫారసు చేస్తారు. దీంతో రైతు ఆర్థికంగా నష్టపోకుండా పరిహారం పొందే అవకాశం ఉంటుంది. ఐదు సంవత్సరాలు నిండిన పశువులన్నింటికి ప్రీమియం చెల్లించవచ్చు. ఈ పథకం కింద దేశవాళీ, సంకరజాతి, చూలు కట్టిన, పాడి పశువులకు వర్తిస్తుంది. 10 సంవత్సరాలలోపు, ఐదు సంవత్సరాల పైబడిన పశువులకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది.