ప్యాసింజర్ సెస్ పేరుతో ప్రయాణికులపై భారం మోపిన టీఎస్ ఆర్టీసీ

సోమవారం, 28 మార్చి 2022 (11:04 IST)
ప్రయాణికులపై ఉన్నట్టుండి తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం చార్జీల భారం మోపింది. ఇటీవలే చిల్లర సమస్యను పరిష్కరించేందుకు వీలుగా రౌండప్ పేరిట చార్జీలను పెంచింది. ఇపుడు మరోమారు భారీగా వడ్డించింది. 
 
ప్యాసింజర్ సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నట్టు ప్రకటించింది. అలాగే, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆకస్మిక నిర్ణయంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు, ప్రయాణికులకు ఆర్టీసీ సేవలు మరింతగా చేరువ చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుని అనేక రకాలైన చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులపై మరోమారు ప్రయాణ చార్జీలు మోపడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు