నిత్యం భార్యతో గొడవ.. సినీ కార్మికుడి ఆత్మహత్య

గురువారం, 14 అక్టోబరు 2021 (20:30 IST)
హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మచిలీపట్నానికి చెందిన తారకేశ్వరరావు సినీ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. యూసఫ్‌గూడలో భార్య శ్రీపద్మ, కుమారుడితో కలిసి నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతడు డబ్బులు ఖర్చు చేస్తుండడంతో నిత్యం భార్యతో గొడవ జరిగేది. 
 
ఈనెల 10న ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపంతో గదిలోకి వెళ్లిన తారకేశ్వరరావు తలుపు వేసుకొని లుంగీతో ఉరేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య గమనించి స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు