సాధారణంగా బస్సుల్లో వెళుతున్నప్పుడు హెవీ లగేజ్‌కు టిక్కెట్టు కొడుతూ ఉంటారు. అయితే ఒక ప్రయాణీకుడు కోడిపుంజుతో పాటు బస్సు ఎక్కితే ఏకంగా ఆ కోడి పుంజుకే టిక్కెట్టు కొట్టాడు కండెక్టర్. ఇదేంటని ప్రశ్నిస్తే జీవి ఏదైనా జీవే.. అది చిన్న తలకాయా.. పెద్ద తలకాయ అని కాదు అంటూ తిరిగి ప్రశ్నించాడట.