టీచర్ దంపతుల పిల్లలను దత్తత తీసుకున్న జానారెడ్డి తనయుడు!

శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (12:34 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అనేక మంది ఉపాధిని కోల్పోయారు. ముఖ్యంగా, ప్రైవేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, కార్మికులు, దినకూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ముఖ్యంగా, ప్రైవేటు స్కూల్స్‌లో పని చేసే బండిపంతుళ్ళ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఎలాంటి ఉపాధి దొరకపోవడంతో కుటుంబపోషణ భారమైపోయింది. 
 
దీంతో అనేక మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో నాగార్జునసాగర్ హిల్ కాలనీకి చెందిన ప్రైవేట్ టీచర్ వెన్నం రవి, ఆయన భార్య సూసైడ్ చేసుకొని రెండు రోజుల క్రితం చనిపోయారు. దాంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. 
 
మృతుడు రవి కుటుంబాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సాగర్ అభ్యర్థి జానారెడ్డి కొడుకు రఘువీర్ పరామర్శించాడు. రవి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి.. పిల్లలను దత్తత తీసుకుంటానని వారికి భరోసా ఇచ్చారు. 
 
అంతేకాకుండా.. పిల్లల చదువులు, ఇతర ఖర్చులన్నీ తానే చూసుకుంటానని రఘువీర్ హామీ ఇచ్చాడు. సాగర్‌లో ఉపఎన్నిక దగ్గరపడుతున్న సమయంలో.. జానారెడ్డి కొడుకు రఘువీర్.. మృతుడు రవి కుటుంబాన్ని పరామర్శించడం చర్చనీయాంశంగా మారింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు