దీంతో నల్గొండ ఉపఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికలకు ఏడాది ముందుగానే తమ సత్తా చాటే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ ఉందని సమాచారం. తమ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన నేతలు వారి పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుత్తా తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఈ ఉపఎన్నికలో తెరాస గెలవడం ద్వారా తాము బలంగా ఉన్నామనే విషయాన్ని అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీకి తెలియజెప్పాలని కేసీఆర్ గట్టిగా భావిస్తున్నారు.