తొలివారంతో పోలిస్తేనే 14 శాతం అధికంగా కరోనా కేసులు వస్తున్నాయి. ముంబై, పుణే నగరాల్లో ప్రతిరోజు 600 పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో సోమవారం 28 కేసులు నమోదు కాగా, మంగళవారం ఆ సంఖ్య 103కు పెరిగింది.
ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో మనకు సరిహద్దు ఎక్కువగా ఉంది. కేరళతో విస్తృత సంబంధాలున్నాయి. అక్కడకు చెందిన అనేకమంది నర్సులు, టీచర్లు మన రాష్ట్రంలో పనిచేస్తుంటారు.
ఇక మహారాష్ట్ర నుంచి సరిహద్దు జిల్లాలకు రోజువారీ రాకపోకలు జరుగుతాయి. ఈ రాష్ట్రాలకు నిత్యం అనేక విమాన సర్వీసులు నడుస్తాయి. రోజూ వేలాది మంది వస్తూ పోతుంటారు. దీంతో తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.