జగనన్న బాణం వస్తోంది, కేసీఆర్‌ని కాపాడుకోవాలి: మంత్రి గంగుల

మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (17:40 IST)
కరీంనగర్: రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో మీడియాతో మంగళవారం మాట్లాడుతూ.. వైఎస్ షర్మిల పార్టీపై స్పందించారు.
 
జగనన్న బాణం షర్మిల వస్తోందని.. ఆ తర్వాత మెల్లగా జగన్ వస్తాడని, జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తాడని వ్యాఖ్యానించారు.
 
తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవని, కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని, లేకపోతే సమైక్య రాష్ట్రం అవుతుందని హెచ్చరించారు. ఆంధ్రా నేతలు కరెంటు, నీళ్లు ఎత్తుకపోతారని, కేసీఆరే రక్షకుడని గంగుల అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు