రాష్ట్ర స్థాయిలో స్థాయిలో పాత గోనె సంచుల రిపేరు, విక్రయాలకు ఎస్.అన్నవరం ప్రసిద్ధి చెందింది. వివిధ రాష్ట్రాల నుంచి లారీల్లో పాత గోనె సంచులు కొని తేవడం, వాటికి మరమ్మతులు చేసి తిరిగి ఎగుమతి చేయడం దశాబ్దాలుగా జరుగుతున్న వ్యవహారం. దీనిని మద్యం అక్రమ వ్యాపారులు తమకు అనువుగా మలుచుకుని గోనె సంచుల లారీల్లో తెలంగాణ నుంచి లక్షల విలువైన మద్యాన్ని తీసుకుని వచ్చి ఈ ప్రాంతంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
దీనిని ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారులు స్థానిక అధికారులపై విచారణ జరిపి వాస్తవాలు నిర్ధారణ కావడంతో సీఐ, ఎస్‌ఐతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ ఽఘటన తర్వాత అప్రమత్తమైన అక్ర మ వ్యాపారులు కొంతమేర గప్‌చుప్ అయ్యారు. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వ్యాపారాన్ని మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా ఎస్‌ఈబీ సూపరింటెండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో పెద్ద మొత్తంలో తెలంగాణ మద్యం పట్టుబడడం ఇదే మొదటిసారి అన్నారు. దీని విలువ రూ.10 లక్షల నుంచి రూ.13 లక్షలు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా సిద్ధిపేటలో రెండు వైన్‌షాపుల వద్ద కొనుగోలు చేసి పోలీసుల కళ్లుగప్పి తుని వరకు తరలించినట్టు గుర్తించామన్నారు.