తెలంగాణలో కొత్తగా 1536 కరోనా కేసులు.. ముగ్గురు మృతి

మంగళవారం, 3 నవంబరు 2020 (09:56 IST)
తెలంగాణలో కొత్తగా 1536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మరో 617 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.
 
తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,42,506కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1351కి చేరింది. ప్రస్తుతం 17,742 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 14,915 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 1421 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,23,413కి చేరింది.
 
సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 45,021 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 43,94,330కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,18,063 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.55శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 91.7శాతం ఉండగా తెలంగాణలో 92.12శాతం ఉన్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు