ఇంటికెళ్ళి తన పిల్లలను మిద్దెపైన తన స్నేహితుని ఇంటికి పంపాడు. మీరు రాత్రికి ఇక్కడే పడుకోండి అన్నాడు. విజయారెడ్డి కుమార్తె నాన్న...అమ్మ ఎక్కడికి వెళ్ళింది.. ఎప్పుడు వస్తుందని అడిగింది. ఏం సమాధానం చెప్పాలో తెలియక బాధను దిగమింగుకున్నాడు సుభాష్. అమ్మ..ఉదయాన్నే వచ్చేస్తుంది నాన్న. ఏదో పనిమీద బయటకు వెళ్ళిందట అంటూ బుజ్జగించి వచ్చేశాడు.
ఉదయాన్నే విజయారెడ్డి పార్థీవదేహాన్ని ఆమె నివాసముండే అపార్ట్ మెంట్ వద్దకు తీసుకొచ్చారు. మీ అమ్మ చనిపోయిందంటూ గట్టిగా ఏడుస్తూ తన కుమార్తెకు చెప్పాడు సుభాష్ రెడ్డి. తల్లి చనిపోయిందన్న విషయం కుమార్తెకు తెలుసు..కానీ కుమారుడు చిన్న వయస్సు. ఏం జరుగుతుందో అర్థం కాక తల్లి పార్థీవదేహం వద్ద కూర్చుని ఉండడం అందరినీ తీవ్రంగా కలచివేసింది.