హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో డ్రగ్స్.. విలువ రూ.53కోట్లు

ఆదివారం, 6 జూన్ 2021 (13:51 IST)
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.53 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఓ మహిళపై అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించగా.. 8 కిలోల‌ హెరాయిన్‌ లభ్యమైనట్లు క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకోని విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఆదివారం ఉదయం దోహా నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కుల‌ వ‌చ్చిన మ‌హిళ వ‌ద్ద మాద‌క‌ద్ర‌వ్యాలు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ఈ క్ర‌మంలో డీఆర్ఐ అధికారులు మ‌హిళ‌ను అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించారు. నిందితురాలిని జాంబియాకు చెందిన ముకుంబా క‌రోల్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
 
ఇదిలాఉంటే.. చెన్నై విమానాశ్రంలో కూడా 10కేజీల హెరాయిన్ లభ్యమైనట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీని విలువ రూ.73 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ మహిళ కూడా సౌత్ ఆఫ్రికాకు చెందిన మహిళగా అధికారులు తెలిపారు. అయితే.. ఇటు శంషాబాద్, అటు చెన్నైలో భారీగా హెరాయిన్ పట్టుబడటంతో డీఆర్ఐ అధికారులు అప్రమత్తమయ్యారు. వీరిద్దరికీ లింకు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై విచారణ జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు