48 గ్రామాల్లో 315 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. 89 సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 23 మంది బరిలో ఉన్నా.. ప్రధాన రాజకీయ పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే పోటీ ఉంది.
ఇంటింటి ప్రచారంలో ప్రతీ ఓటరును నేరుగా కలిసి, ఫోన్లు చేసి తమ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. రాజ కీయ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో పోలింగ్ శాతం గతంలో కన్నా పెరిగే అవ కాశముందని భావిస్తున్నారు.
దుబ్బాకలో మొత్తం ఓటర్లు 1,98,807 మంది కాగా, పురుష ఓటర్లు 98,028 మంది.. మహిళా ఓటర్లు 1,00,719 మంది ఉన్నారు.