హైదరాబాద్ : కోకో కోలా, పెప్సీ, సెవన్ అప్, స్ప్రైట్... ఇవి తాగితే పెద్ద హీరోలయిపోతారన్నట్లు టీవీల్లో యాడ్స్ ఇస్తారు. తీరా వీటి వల్ల అన్నీ రోగాలే అని పరిశోధనలు తేలుతున్నాయి. ఈ తలనొప్పి కాక, ఇపుడు ఈ కూల్ డ్రింకులనూ డూప్లికేట్ తయారుచేస్తున్నారట. హైదరాబాదులో డూప్లికేట్ కోకో కోలా ఫ్యాక్టరీ ఒకటి పట్టుబడింది. ఇందులో కోలా బ్రాండులన్నింటినీ నకిలీవి తయారు చేస్తున్నారు.
రసాయనాలను మిక్స్ చేసి, అచ్చం పెప్సీ, కోలా మాదిరిగా తయారు చేసి, వాటిపై డూప్లికేట్ స్టిక్కర్లు అతికిస్తున్నారు. అసలే కూల్ డ్రింకులు డేంజర్ అని వైద్య నిపుణులు చెపుతున్నారు. దీనికితోడు ఈ నకిలీల బెదడ, అందరి ఆరోగ్యాలను బుగ్గి చేసేస్తోంది. అందుకే ఇలాంటి డ్రింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.