నడిరోడ్డుపై తండ్రి నరికినా ఆ కూతురు ఏం చెప్పిందంటే..?

గురువారం, 18 అక్టోబరు 2018 (20:52 IST)
ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పా. కులం తక్కువైతే చంపేస్తారా. తండ్రికి ప్రేమ ఉండదా. అంతమాత్రం ఆయనకు తెలియదా. నన్ను, నా భర్తను నడిరోడ్డుపై చంపాలనుకున్న నా తండ్రిని జైలు నుంచి బయటకు తీసుకురావద్దండి. ఆయన్ను జైలులోనే మగ్గనీయండి. పశ్చాత్తాపం పడేటట్లుగా నటించడం మా నాన్నకు బాగా తెలుసు. ఆయన స్వభావం నేను చిన్నతనం నుంచి చూస్తున్నా. నా తండ్రికి బయటకు వస్తే నాకు, నా భర్తకు ప్రాణ హాని ఉంది అని చెబుతోంది మాధవి.
 
మాధవి ఎవరో కాదు సరిగ్గా గత నెల 19వ తేదీ హైదరాబాద్ నగరంలోని ఎర్రగడ్డలో తన భర్త సందీప్‌తో కలిసి వెళుతున్న మాధవిపై ఆమె తండ్రి మనోహరాచారి దాడి చేశాడు. కత్తితో ఇద్దరిని నడిరోడ్డుపై నరికేందుకు ప్రయత్నించాడు. సందీప్ తప్పించుకుంటే కూతురు కత్తిగాట్లకు బలైంది. మాధవి చెవి దగ్గర తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమై సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో 28 రోజుల పాటు చికిత్స చేయించుకుంది మాధవి. నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మాధవి మీడియాతో మాట్లాడింది. 
 
నా తండ్రి బెయిల్ మీద బయటకు వచ్చేట్లు మా బంధువులు చెబుతున్నారు. ఆయన్ను బయటకు తీసుకురావద్దండి. మళ్ళీ మాకు ప్రాణ హాని ఉంటుంది. మా నాన్నకు ప్రేమంటే తెలియదు. ద్వేషించడం మాత్రమే తెలుసు. మా కుటుంబంలో మా నాన్న ఎప్పుడూ కోపంగానే ఉంటాడు అంటూ బోరున విలపించింది మాధవి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు