ఇదికాక రూ. 7 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నాడు. వెరసి మొత్తం రూ. 48 లక్షలు, వీటికి ఈఎంఐలు కట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొని వుండవచ్చని అనుమానిస్తున్నారు. కాగా శ్రీకాంత్- అనామిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పదేళ్లక్రితం పెద్దలు అనుమతి తీసుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఏడేళ్ల కుమార్తె కూడా వుంది. కానీ ఏమైందో తెలియదు కానీ ముగ్గురూ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మరోవైపు అనామిక తండ్రి ఫోన్ చేసినా స్పందన లేదు. దీనితో అనుమానం వచ్చిన అనామిక తండ్రి నేరుగా వారి ఇంటికి వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించగా లోపల గడియపెట్టి వుంది. దీనితో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా అనామిక, ఆమె కుమార్తె ఇద్దరూ మంచంపై పడి నురగలు కక్కి మరణించి వున్నారు.
శ్రీకాంత్ గౌడ్ తన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. మృతదేహాలను పరిశీలించగా వారి నుదుటున కుంకుమ బొట్లు పెట్టుకుని వున్నారు. దేవుడి పటాలను బోర్లించి పెట్టారు. ఐతే వీరి మరణానికి కారణం ఆర్థిక సమస్యలు అని ప్రాధమికంగా నిర్థారణకు వచ్చారు. ఐతే ఆధ్యాత్మిక పరంగా ఏమయినా నమ్మకాల వల్ల ఇలా చేసుకున్నారేమోనన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.