తన నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా స్కూల్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నా గ్రామం-నా పాఠశాల కార్యక్రమం కింద తన సొంత ఖర్చులతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. నానమ్మను స్మరించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం గురించి ఆలోచించడం లేదన్నారు.
కామారెడ్డి జిల్లా బేబీ పేట మండలం కోనాపూర్ గ్రామానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేరుకున్న ఆయన్ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ జి వి పాటిల్ ఘన స్వాగతం పలికారు.
గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలవేసి కేటీఆర్ నివాళులర్పించారు. గ్రామంలో సీసీ రోడ్డు పనులను, కార్పొరేట్ స్థాయిలో పాఠశాలకు భూమి పూజ నిర్వహించారు. 20 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు.