ఆన్ లైన్‌లో ఫారెస్ట్ ఆయిల్ పేరిట బురిడీ

శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:58 IST)
ఫేస్ బుక్‌లో హాయ్, హ‌లో, గుడ్ మార్నింగ్ అని చెపుతూ...చ‌క్క‌గా కుచ్చు టోపీ వేశారు. ఫారెస్ట్ ఆయిల్ పేరుతో 11 కోట్ల రూపాయ‌ల‌ సైబర్ మోసానికి పాల్ప‌డ్డారు. కేవ‌లం ఫేస్ బుక్ ద్వారా త‌ల‌కు ఆముదం అంటించారు. ఫారెస్ట్ ఆయిల్ పేరుతో 11 కోట్ల రూపాయ‌ల మోసం చేశారు... సైబర్ నేరగాళ్లు.
 
పేస్ బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి... గీత నారాయణ్ పేరుతో పరిచయం పెంచుకున్నారు. అమెరికాలో ఖరీదైన ఆయిల్ బిజినెస్ చేస్తున్నామని నమ్మించిన చీటర్స్ త‌మ‌కు పెట్టుబ‌డి స‌మ‌స్య ఉంద‌ని తెలిపారు. వ్యాక్సిన్ తయారయ్యే ఆగ్రో సీడ్ ఆయిల్ సప్లయ్ చేస్తామని నమ్మించారు.

విడతల వారీగా అమెరికన్ డాలర్స్ రూపంలో 11 కోట్ల రూపాయ‌లు ఆన్లైన్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారీ సైబర్ చీటర్స్. చివ‌రికి అంతా మోసం అని, ఫారెస్ట్ ఆయిల్ లేదు... త‌న‌కు ఆముదం అంటించార‌ని తెలుసుకున్న బాధితులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు డాక్టర్ మురళీమోహన్ రావు... త‌న డ‌బ్బు త‌న‌కు వాప‌సు ఇప్పించాల‌ని గుండెలు బాదుకుంటున్నారు. ఈ సైబ‌ర్ మోసంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు