గాల్వాన్ లోయలో వీరమరణం : సంతోష్ బాబుకు మహావీర్ చక్ర

మంగళవారం, 23 నవంబరు 2021 (12:25 IST)
భారత్ - చైనా దేశ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో వీర మరణం చెందిన కల్నల్ బిక్కమల్ల సంతోష్ బాబుకు (37)కు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర పురస్కారాన్ని ప్రకటించింది. దీన్ని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా సంతోష్ భార్య, తల్లి ఈ అవార్డును స్వీకరించారు. యుద్ధ సమయాల్లో అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే సైనికులకు ఈ తరహా అవార్డును ప్రదానం చేస్తుంటారు. 
 
కాగా, గత 2020 జూన్ 15వ తేదీన రాత్రి చైనా భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మృత్యువాతపడ్డారు. వీరిలో ఎక్కువ మంది బీహార్ రాష్ట్రానికి చెందిన సైనికులు ఉన్నారు. అయితే, 16 బిహార్ రెజిమెంట్‌లో కమాండింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చిన సంతోష్ బాబు నేతృత్వం వహిస్తున్న దళంతోనే గల్వాన్ లోయలో చైనా సైనికులు ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. 
 
కాగా, సంతోష్ బాబుది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట. 1982లో జన్మించిన సంతోష్ బాబుకు భార్య మంజులు, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్ ఉన్నారు. ఈయన ఒక యేడాదిన్నరగా చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ వచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు