గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడిని హైదరాబాద్ నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఈయనను శేషన్న అలియాస్ రామచంద్రుడిగా గుర్తించారు.
గ్యాంగ్ స్టర్ నయీంకు షాడోగా శేషన్న మెలిగారు. కొత్తపేటలోని ఓ హోటల్‌లో శేషన్న సెటిల్‌మెంట్ వ్యవహారంలో నిమగ్నమైవున్నట్టు వచ్చిన పక్కా సమాచారంతో అక్కడకు వెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులు శేషన్నను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్‌ను కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు రికవరీ చేశారు.
2016లో నయీం ఎన్‌కౌంటర్ తర్వాత శేషన్న పెద్దగా క్రియాశీలకంగా లేరు. నయీమ్‌తో కలిసి శేషన్న హత్యలు, భూ ఆక్రమణలు, సెటిల్‌మెంట్లు సహా పలు నేరాల్లో పాల్గొన్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం.