తమ్ముడు ప్రేమించిన అమ్మాయిపై అన్న అత్యాచారం, హత్య

సోమవారం, 19 అక్టోబరు 2020 (11:33 IST)
హైదరాబాద్ లోని పాతబస్తీలోని రెయిన్ బజార్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. పాతబస్తీలో ఓ యువతిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. మతాంతర ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని తెలుస్తోంది.
 
నారాయణఖేడ్‌కు చెందిన ఓ యువతి, నగరానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇష్టపడని యువకుడి అన్న దారుణానికి ఒడిగట్టాడు. సోదరుడు ప్రేమించిన ప్రియురాలిపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు.
 
ఈ సంఘటన పాతబస్తీలో కలకలం రేపింది. బాధితురాలి మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం జరిగింది. అనంతరం యువతి మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు