గత ఆరేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల ఫలితంగా మొట్టమొదటి సారి పాఠశాలల్లో బాలురకంటే బాలికల చేరిక పెరిగిందని ప్రధాని వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ వ్యవసాయ ఆహార సంస్థ (ఎఫ్‌ఏవో) 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మోదీ ఆ సంస్థ సేవలకు గుర్తింపుగా రూ.75 నాణేన్ని విడుదల చేశారు. ఎఫ్‌ఏవోను ఏర్పాటుచేసిన రోజునే ప్రపంచ ఆహార దినోత్సవంగా కూడా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
దేశంలో ప్రస్తుతం యువతుల వివాహ వయస్సు 18 ఉండగా, యువకులకు 21 ఏండ్లుగా వుంది. కనీస వివాహ వయసు 18 ఏండ్లు ఉండటం వల్ల ఆలోపే యువతులకు తల్లిదండ్రులు పెండ్లి చేసేస్తున్నారు. దానివల్ల యువతులు తమ ఆకాంక్షలు నెరవేర్చుకోలేకపోతున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా చిన్న వయసులో వివాహాల వల్ల యువతులు కుటుంబ భారాన్ని మోయలేకపోతున్నారని, అందువల్ల వివాహ వయసును 21ఏండ్లకు పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. ఈ అంశంపై పరిశీలిస్తున్నామని చెప్పారు.