బీర్ బాటిళ్ళపై కోవిడ్ సెస్ తొలగింపు.. తగ్గనున్న ధరలు

ఆదివారం, 13 మార్చి 2022 (15:32 IST)
కరోనా కష్టకాలంలో బీర్ బాటిళ్లపై కూడా కోవిడ్ సెస్‌ను వసూలు చేశారు. ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో ఈ సెస్‌ను రద్దు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా బీరు ధరలు తగ్గనున్నాయి. ఇది మందుబాబులకు ఎంతో సంతోషాన్ని కలిగించే వార్త. 
 
నిజానికి ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య సాగుతున్న యుద్ధం కారణంగా దేశ వ్యాప్తంగా నిత్యావసరవస్తు ధరలు, నూనెలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కానీ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల బీరు ధరలు మాత్రం బాగా తగ్గనున్నాయి. 
 
మద్యంపై 17 శాతం మేరకు కోవిడ్ సెస్‌ను వసూలు చేస్తూ వచ్చింది. దీన్ని తొలగించనుంది. ఇదిలావుంటే, రాష్ట్రంలో గత 2021 జూలై నెలలో బీర్ బాటిల్‌పై రూ.10 తగ్గించింది. అయినప్పటికీ బీర్ విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇపుడ్ కోవిడ్ సెస్ తొలగించాలని నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్రంలో బీరు విక్రయాలు ఊపందుకునే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు