ప్రజల ఆరోగ్యమంటే ఏమనుకుంటున్నారని, వారి జీవితాతో చెలగాటం ఆడితే ఎట్లని నిప్పులు చెరిగింది. కరోనాపై దాఖలైన పిల్స్‌ను బుధవారం చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి డివిజన్ బెంచ్ విచారించింది. నాలుగు వారాల సమయం ఇస్తే జీవో ఇస్తామని సర్కార్ చెప్పడాన్ని తప్పుపట్టింది.
అలాగే, కరోనా చికిత్సలో వాడే లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను అత్యవసర మందుల జాబితాలో చేర్చుతున్నదీ లేనిదీ చెప్పకుండా కేంద్రం అరకొర వివరాలతో నివేదిక ఇస్తే కుదరదని, వచ్చే విచారణ సమయంలో సూటిగా విషయాన్ని చెబుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.