అనన్యను ఔటర్ రింగ్ రోడ్ మింగేసింది... మితిమీరిన వేగమేనా?

మంగళవారం, 9 జనవరి 2018 (14:03 IST)
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపైన మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం బుర్జుగడ్డ పివన్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో హెచ్‌సీయూకు చెందిన అనన్య అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో కారులో అనన్యతో పాటు నిఖిత, నితిన్ అనే మరో ఇద్దరు విద్యార్థులు కూడా వున్నారు.
 
ఔటర్ రింగ్ రోడ్డుపై వెళుతున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగమే కారణమని భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నిఖిత, నితిన్‌లను ఆసుపత్రికి తరలించారు. వీరు ముగ్గురూ హెచ్‌సీయూ క్యాంపస్ నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా షాద్‌నగర్ వైపు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు