హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, లంగర్ హౌస్, గోల్కొండ, కార్వాన్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాయదుర్గం, గచ్చిబౌలి, ఫిలింనగర్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, చర్లపల్లి, అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, రామంతపూర్, ఉప్పల్, బోడుప్పల్, పిర్జాదీగూడ, మేడిపల్లి, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలి పురం, కాచిగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, విద్యానగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.
మరోవైపు నేడు, రేపు హైదరాబాద్ నగరానికి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంటనే రోడ్లపైకి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు.