తెలంగాణలో భారీ వర్షాలు.. ఏపీలో ఆదివారం వరకు 3 రోజుల పాటు..?

శుక్రవారం, 5 నవంబరు 2021 (19:11 IST)
తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో శ్రీలంక దగ్గర్లోని కొమరీన్ ఏరియాలో అల్పపీడనం ఏర్పడింది. దీని ఎఫెక్ట్‌తో ఏపీ తీరం వరకు వ్యాపించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా బలహీనపడింది. దీంతో దాదాపు మూడు రోజులు తెలంగాణలో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. 
 
ఇప్పటికే వాతావరణంలో కాస్త తేడా కనిపిస్తోంది. 2 రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వరి, మిర్చి రైతలుకు ఇది గడ్డుకాలంగా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట.. నీటిపాలు కావడంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
 
ఏపీలో ఆదివారం వరకు ఓ మూడు రోజులపాటు వర్షాలు కురువయనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా వైపు వస్తోంది. మరో 24 గంటల్లో అల్పపీడనం బలపడే అవకాశాలు ఉన్నాయని.. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు