ఉద్యోగం ఉండాలంటే కాళ్లకు మసాజ్ చేయండి.. ప్రిన్సిపాల్ హుకుం.. ఎక్కడ?

మంగళవారం, 15 డిశెంబరు 2020 (09:04 IST)
ఇద్దరు మహిళలు ఓ పాఠశాలలో పారిశుద్ధ్య సిబ్బందిగా పని చేస్తున్నారు. ఈ హౌస్ కీపింగ్ సిబ్బంది విధులు... తరగతి గదులతో పాటు.. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడం, మరుగుదొడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం. కానీ, ఈ సిబ్బందితో ప్రిన్సిపాల్ మరోరకమైన విధులు చేయించుకుంటున్నారు. ఉద్యోగం ఉండాలంటే.. తమకు ప్రతి రోజూ కాళ్లు ఒత్తాల్సిందేనంటూ హుంకుం జారీచేశారు. తనతో పాటు.. తనతో పని చేసే సిబ్బందికి కూడా కాళ్ళ మసాజ్ చేయాల్సిందేనంటూ ఆదేశించారు. ఫలితంగా ఆ ఇద్దరు సిబ్బంది ఉద్యోగ భయంతో ప్రతి రోజూ ప్రిన్సిపాల్‌తో పాటు మరో సిబ్బందికి కాళ్ళు ఒత్తడం, మసాజ్ చేయసాగారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌ మండలం అల్గోల్‌లో మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో హౌస్‌ కీపింగ్‌ విభాగంలో ఇద్దరు మహిళలు పని చేస్తున్నారు. ఈ ఇద్దరు మహిళలతో ప్రిన్సిపాల్‌ జ్యోతిర్మయి రోజూ కాళ్లు పట్టించుకుంటున్నారు. మసాజ్ చేయించుకునేవారు. ఆమె సహోద్యోగి కూడా ఇవే సేవలు చేయించుకుంటున్నారు. ఈ తతంగమంతా కెమెరాకు చిక్కడంతో విషయం వెలుగుచూసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు