భర్త మంచోడే, ఆర్థిక కష్టాలు లేవు, పిల్లలున్నారు, మరి ఈ హైదరాబాద్ టెక్కీ ఎందుకు ఆత్మహత్య?

శనివారం, 3 అక్టోబరు 2020 (13:33 IST)
ఆత్మహత్య... ప్రాణాన్ని బలంగా తీసేసుకోవడం, ఇది ఒక్క మానవ జాతిలోనే కనిపిస్తుంది. మిగిలిన జీవులన్నీ ప్రాణాలు పోతున్నా నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి. కానీ కొందరు మనుషులు మాత్రం తమకు ఏ చిన్న కష్టం వచ్చినా, కోపం వచ్చినా, భరించలేని మానసిక ఒత్తిడి తలెత్తినా... ముందుగా వారి చూపు వారి ప్రాణంపైనే పడుతోంది. ఫలితంగా ఆత్మహత్యే మార్గమని తనువు చాలిస్తున్నారు.
 
తాజాగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య ఇలాంటిదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ నార్సింగ్‌ పీఎస్‌ పరిధిలోని హైదర్‌‌షాకోట్‌ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలోని సామ్రాట్‌ అపార్టుమెంట్‌లో రమ్యకృష్ణ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని, తన భర్త పిల్లలతో కలిసి వుంటోంది. ఐతే ఆమె ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
ఐతే ప్రాధమిక దర్యాప్తులో భర్త చెప్పిన వివరాల ప్రకారం, తమకు ఆర్థిక కష్టాలు లేవనీ, ఇద్దరు కవల పిల్లలున్నారనీ, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని వెల్లడించాడు. రమ్య ఎందుకు ఈ పని చేసిందో అర్థం కావడంలేదని బోరుమంటున్నాడు. కాగా ఐదేళ్ల క్రితం గోపి, రమ్యకృష్ణల వివాహం జరిగింది.
 
వీరిరువురూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే కావడంతో ఆర్థిక కష్టాలు లేవని తెలుస్తోంది. జీవితం సంతోషంగా, సాఫీగా సాగిపోతోన్న ఈ సమయంలో రమ్యకృష్ణ యెందుకు ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు పలు విధాలుగా దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఇప్పటివరకూ రమ్య తల్లిదండ్రులు ఈ విషయమై స్పందించలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు